మురుగదాస్‌‌‌ని అరెస్ట్ చెయ్యడానికి ఇంటికి వెళ్ళిన పోలీసులు

10:09 - November 9, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, రూపొందిన  సర్కార్, భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో మొన్న రిలీజ్ అయింది. తెలుగు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
 కేవలం రెండే రెండు రోజల్లో ప్రపంచవ్యాప్తంగా, రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసి, దళపతి సత్తా చాటింది సర్కార్.  ఇప్పుడు తమిళనాట ఈ సినిమాకి రాజకీయ సెగ తగులుతోంది. ప్రభుత్వంపై సెటైర్లు వేసారనీ, వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు థియేటర్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి, దర్శకుడు మురుగదాస్‌‌ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులను రంగంలోకి దింపింది. ఈవిషయాన్ని మురుగదాస్‌ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. అర్థ రాత్రి పూట తాను ఇంట్లో లేనప్పుడు, పోలీసులు తమ ఇంటికివచ్చి, చాలాసార్లు తలుపులు కొట్టారని, ఆ టైమ్‌లో తను ఇంట్లోలేనని, కొద్దిసేపటి తర్వాత పోలీసులు వెళ్ళిపోయారని దాస్ తెలిపాడు.  ఇదే విషయాన్ని సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. నటుడు విశాల్, మురుగదాస్‌ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్ళారు.సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చాక కూడా ఈ నాన్సెన్స్ ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం, సర్కార్ వర్సెస్ తమిళనాడు  సర్కార్ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు విజయ్ అభిమానులు.
   

Don't Miss