లగడపాటి సర్వే : మహాకూటమిదే విజయం

19:23 - December 7, 2018

లగడపాటి రాజగోపాల్ సర్వే విడుదల చేశారు. ఇప్పటి వరకు చేసిన సర్వేల్లో అత్యంత క్లిష్టమైనది ఇదే అంటున్నారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయం అంటున్నారు. కేవలం 35 సీట్లకే పరిమితం అవుతుందన్నారు. కాంగ్రెస్ - టీడీపీ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి 65 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణ హస్తం చేతికి చిక్కిందన్నారు. టీఆర్ఎస్, ప్రజాకూటమి సాధించే స్థానాల్లో 10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందన్నారు. ఈ లెక్కన తీసుకున్నా టీఆర్ఎస్ అధికారంలోకి రాదని తన సర్వేలో తేలిందన్నారు. బీజేపీ 7, ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు. జిల్లాల్లో 80శాతం కూటమికే ఆధిక్యం వస్తుందన్నారు.
డబ్బు, ప్రలోభాలు పని చేశాయి :
గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎన్నికల్లో డబ్బు, ప్రలోభాలు బాగా పని చేశాయి అన్నారు. డబ్బు బాగా ఖర్చు చేశారు అన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో ఏపీ, కర్నాటక, తమిళనాడులో మాత్రమే డబ్బు ప్రభావం ఉంటుందని.. ఈసారి ఆ సంస్కృతి తెలంగాణలోకి కూడా ప్రవేశించింది అన్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలు వరసగా చేసిన సర్వేల్లో ఈ లెక్కలు తేలాయన్నారు. గ్రామాల్లో ఈసారి ఓటింగ్ పోటాపోటీగా సాగిందన్నారు.
సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి :
టీఆర్ఎస్ : 35 స్థానాలు (10 అటూ ఇటూ ఉండొచ్చు)
ప్రజాకూటమి : 65 సీట్లు (10 అటూ ఇటూ ఉండొచ్చు)
ఎంఐఎం : 6-7
బీజేపీ : 7 సీట్లు (2 అటూ ఇటూ ఉండొచ్చు)
ఇండిపెండెంట్లు : 7 సీట్లు (2 అటూ ఇటూ ఉండొచ్చు)

Don't Miss