ఈనెల 11 నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు

07:54 - November 5, 2018

హైదరాబాద్ : ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగా ప్రకటించి ప్రచారంతో హోరెత్తిస్తోన్న టీఆర్‌ఎస్‌...  బీ-ఫారాలను సైతం ముందుగానే పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  ఈనెల 12 నుంచి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించనున్నారు. ఈ గడువు ఈనెల 19 వరకు ఉంది. ఈ నేపథ్యంలో 11వ తేదీ నుంచి బీ-ఫారాలను పంపిణీ చేయడానికి టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7న దీపావళికాగా.. మరుసటి రోజు కార్తీకమాసం మొదలవుతుంది. 12న సోమవారం మంచి రోజనే భావనతో కొంతమంది  అభ్యర్థులు ఆ రోజున నామినేషన్లు వేయాలనుకుంటున్నారు. దీంతో కేసీఆర్‌ దీనిపై నిన్న కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. అభ్యర్థులందరికీ ఒకేసారి బీ-ఫారాలు పంపిణీ చేయాలా , దశల వారీగా ఇవ్వాలా, లేదా నేరుగా అభ్యర్థుల ఇళ్లకే పంపించాలా అనే అంశంపై చర్చించినట్టు సమాచారం. అయితే మిగిలిన 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే బీ-ఫారాలు అందజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

 

Don't Miss