ప్రధాని మోడీ అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంక చోప్రా రిసెప్షన్ ఫొటో

08:34 - December 6, 2018

ఢిల్లీ : బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు ఢిల్లీలో ఘనంగా వివాహ విందు ఇచ్చారు. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్రమోడీ హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు ప్రధాని అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రిసెప్షన్ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి ప్రియాంక చోప్రాను నిక్ జోనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ’ప్రియాంక చోప్రా, నికి జోనస్.. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా.. మీకు అభినందనలంటూ’ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. 

 

Don't Miss