రాజస్థాన్ పోల్స్ : మ.ఒంటిగంట వరకు 41.53శాతం పోలింగ్

14:41 - December 7, 2018

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.53శాతం పోలింగ్ నమోదైంది.
రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు గాను 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్వార్‌ జిల్లాలోని రామ్‌గఢ్‌ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతితో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 51,687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.
రాష్ట్రంలోని 130 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ జరగనుంది. బీజేపీ నుంచి వసుంధరా రాజే తిరిగి అధికార పగ్గాలు చేపడతామని ధీమాతో ఉండగా కాంగ్రెస్‌ నుంచి అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ.. అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నాయి. మరి గెలుపు ఎవరిది? అన్నది డిసెంబర్ 11న తేలనుంది.

Don't Miss