ఎంజే అక్బర్‌పై అత్యాచార ఆరోపణలు

15:44 - November 2, 2018

ఢిల్లీ : తన దగ్గర పనిచేసే మహిళా జర్నలిస్టులను  లైంగికంగా వేధించారనే ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం పదవి కోల్పోయిన  కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ను "మీటూ"  సెగ వదిలేట్టు లేదు. ప్రియారమణి అనే మహిళా  జర్నలిస్టు మొదటిసారి  అక్బర్ తనపై చేసిన లైంగిక దాడిని ట్విట్టర్లో  ధైర్యంగా బయటపెట్టటంతో ఇంకో 11 మంది మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్ చేసిన అరాచకాలను బయటపెట్టారు. ఇప్పుడు వాషింగ్టన్ లోని నేషనల్ పబ్లిక్ రేడియోలో  చీఫ్  బిజినెస్ ఎడిటర్ గా పనిచేసే  పల్లవి గొగోయ్  అక్బర్ తనను రేప్ చేశాడని తన బ్లాగ్ లో వివరించారు. తన 23 ఏళ్ల వయసుల్లో1994లో అక్బర్ తనపై అత్యాచార యత్నం చేసినట్లు  పల్లవి తెలిపారు.  ఏషియన్ ఏజ్ పత్రికలో పని చేస్తున్నసమయంలో " ఒక వార్త విషయమై ఆయన  వద్దకు వెళ్లినప్పడు తన పనితనాన్ని మెచ్చుకుని ఒక్కసారిగా ముద్దుపెట్టుకోబోయారు. ఆ చర్యతో షాక్ కి గురైన వెంటనే ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చేశాను".  ఆనాటి ఘటన ఇంకా నాకు గుర్తుంది అని పల్లవి  తన బ్లాగులో  రాశారు. ఇంతకు మునుపు ఆరోపణలు చేసిన వారు తమను లైంగికంగా వేధించారనే ఆరోపించారు, కానీ పల్లవి గొగోయ్ అత్యాచారం చేసారని ఆరోపించారు. 
మరోసారి జైపూర్ లోని హోటల్ రూంలో జరిగింది. ఒక ఎసైన్మెంట్  పూర్తి చేసుకుని రూమ్ ఖాళీ చేసి వెళుతున్న సమయంలో అక్బర్ పల్లవిని తన రూమ్ లోకి పిలిచారు. ఆమెకు అప్పచెప్పిన  కధనం విషయమై మాట్లాడటానికి.  రూమ్ లోకి వెళ్ళిన పల్లవిని అక్బర్ లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు. ఆయన ముందు పల్లవి ఓడిపోయింది. ఆతర్వాత కూడా అక్బర్ పల్లవిని వేధించడం ఆపలేదు. అయితే.... ఆయన గొప్పగా రాస్తారని, ఆయనలా రాయటానికి తాను ప్రయత్నించేదానినని, పల్లవి తన బ్లాగులో రాసింది. పల్లవి బ్లాగులో రాసిన విషయాలను వాషింగ్టన్ పత్రిక ప్రచురించింది.  కాగా పల్లవి ఆరోపణలను అక్బర్ న్యాయవాది అవన్నీ అసంబద్ద ఆరోపణలని కొట్టిపారేశారు. కాగా తనపై లైంగిక ఆరోపణలు చేసిన  ప్రియా రమణిపై అక్బర్  పరువునష్టం దావావేశారు.

Don't Miss