టీ ప్రియులకు గుడ్ న్యూస్

16:27 - November 29, 2018

బీజింగ్: మీకు రెగ్యులర్ గా టీ తాగే అలవాటు ఉందా..? అయితే మీకో గుడ్ న్యూస్. తేనీరు సేవించే వారిలో ఎముకలు విరిగే అవకాశం లేనేలేదని చైనా పరిశోధకులు తేల్చేశారు. టీ కి ఎముకల గట్టిదనానికి అవినోభావ సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది. పెకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రజారోగ్య పాఠశాల పరిశోధకులు చేసిన సర్వేలో నిత్యం గ్రీన్ టీ గానీ. గత 30 ఏళ్లుగా టీ తాగుతున్న వ్యక్తులను శోధించగా వారిలో కీళ్లు విరిగిన సందర్భాలు చాలా తక్కువని తేల్చారు. 
ఈ సర్వేలో భాగంగా దాదాపు 4 లక్షల 53 వేల 625 మందిని ప్రశ్నించగా, టీ తాగే అలవాటు లేని వారిలో కంటే టీ తాగే వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు అతి తక్కువ అని పరిశొధకులు తేల్చారు. గతంలో చేసిన సర్వేలో మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ మార్పును గమనించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. 
 

 

Don't Miss