ముందస్తు బెయిల్ కోసం మురుగదాస్ ధరఖాస్తు, విజయ్‌కు రక్షణ

13:15 - November 9, 2018

చెన్నై: మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా దివంగత నేత జయలలిత ప్రభుత్వాన్ని కించపరిచేవింధంగా ఉందని ఏఐడీఎంకే కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. సినిమా పోస్టర్లను తగలబెట్టి, కోయంబత్తూరు, మధురై, చెన్నై ప్రాంతాల్లో సినిమా హాళ్లపై దాడులు చేయడంతో చిత్ర దర్శకుడు మురుగదాస్ ముందస్తు బెయిల్‌కు శుక్రవారం ధరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఇక హీరో విజయ్‌కు కూడా పోలీసు భద్రత కల్పించారు.
దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ సినిమా రెండు రోజుల క్రితం విడుదల అయ్యి దాదాపు రూ 100 కోట్లు వసూలు చేసింది. తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీ వీ షణ్ముగం సైతం సినిమా అభ్యంతరకరంగా ఉందని.. మనోభావాలను రెచ్చగొట్టేవిధంగా సినిమా ఉందని వ్యాఖ్యానించడం విశేషం. ఇది టెర్రరిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యగా పోల్చడంతో మురుగదాస్ ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకున్నారు. 

 

 

Don't Miss