సన్నివేశాలను తొలగించేందుకు అంగీకారం తెలిపిన సన్ పిక్చర్స్

13:25 - November 9, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, రూపొందిన సర్కార్‌కీ, తమిళనాడు  సర్కార్‌కీ మధ్య వార్ జరుగుతుంది. విజయ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సీన్స్‌‌‌లో, తమిళ రాజకీయాలపైనా, అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాలపైనా సెటైర్లు వేసాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర అచ్చు జయలలితను పోలి ఉందని అంటున్నారు. సినిమాలోని వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు థియేటర్ల ముందు ధర్నాలు చేసారు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి, గత రాత్రి దర్శకుడు మురుగదాస్‌‌ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో, విజయ్ సర్కార్ వర్సెస్ తమిళనాడు సర్కార్ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసారు విజయ్ అభిమానులు. సర్కార్ సినిమా వివాదం గురించి తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీ‌కాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌లు విజయ్‌కి అండగా నిలవబోతున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక, ఎట్టకేలకు సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించేందుకు సన్ పిక్చర్స్ అంగీకరించిందని తెలుస్తోంది. దీని విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనవసరమైన గొడవలెందుకనే ఉద్దేశంతో  సన్ పిక్చర్స్ యాజమాన్యం రాజీకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
 
 

 

Don't Miss