ఆసక్తికరంగా సవ్యసాచి ట్రైలర్‌

16:25 - October 24, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. మొన్నామధ్య రిలీజ్ చేసిన టీజర్‌ అండ్ సాంగ్స్‌కి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సవ్యసాచి ధియేట్రికల్ ట్రైలర్‌ని ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. టీజర్‌‌ని నాగచైతన్య వాయిస్ ఓవర్‌తో మొదలుపెడితే, ట్రైలర్‌ని విలన్ పాత్రధారి మాధవన్ వాయిస్‌తో స్టార్ట్ చేసారు. భారతంలో అర్జునుడికి రెండుచేతులకు సమానమైన బలంఉండేది.. అలాంటి శక్తి ఒక హీరోకి ఉంటే ఎలా ఉంటుంది, అతని ఎడమ చెయ్యి అతని   ఆధీనంలో లేకపోవడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన అంశంతో రూపొందుతున్న సవ్యసాచిలో, కామెడీ, ఎమోషన్, లవ్ అండ్ సెంటిమెంట్ వంటివన్నీ ఉన్నాయనేది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. విలన్‌కీ, హీరోకీ మధ్య జరిగే వార్  ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనిపిస్తుంది.. ఎమ్.ఎమ్.కీరవాణి నేపధ్యసగీతం, యువరాజ్ కెమెరా వర్క్ బాగున్నాయి.. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.. ఈ మూవీ ద్వారా చైతూ  మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.. భూమికాచావ్లా, వెన్నెల కిషోర్, ముకుల్ దేవ్, రావు‌రమేష్ తదితరులు నటిస్తున్న సవ్యసాచి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. 

 

Don't Miss