సీబీఐ కేసును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

17:03 - November 2, 2018

ఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణం కేసులో 2005 మే31న ఢిల్లీ  హైకోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారించాలని సీబీఐ దాఖలు చేసిన కేసును సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు హిందూజా సోదరులకు బోఫోర్స్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అప్పీల్ అనేది నిర్ణీత స‌మ‌యం ప్ర‌కారం జ‌ర‌గాల‌ని, ఆకార‌ణం చేత ఈకేసులో సీబీఐ అప్పీల్‌ను స్వీక‌రించ‌లేమ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. దాదాపు దశాబ్దకాలం తర్వాత బోఫోర్స్‌‌పై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా పిటిషన్ వేయాలంటూ స్వయంగా అటార్నీజనరల్ వేణుగోపాల్ సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయంటూ సీబీఐ ఈఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసిన పిటీషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. బోఫోర్స్ కాంట్రాక్టు కోసం స్వీడ‌న్‌కు చెందిన కంపెనీ, హిందూజా సోద‌రుల‌కు మధ్య 8.3 మిలియ‌న్ల డాల‌ర్లు చేతులు మారినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Don't Miss