నవ్విస్తూ భయపెట్టే కామెడీ థ్రిల్లర్

10:12 - November 19, 2018

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ మెయిన్ లీడ్స్‌గా, రాహుల్ సంక్రిత్యాన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, ఎస్.కె.ఎన్ నిర్మించిన కామెడీ థ్రిల్లర్.. టాక్సీవాలా... ఎన్నో అవాంతరాలను దాటుకుని, ఈరోజు రిలీజైన టాక్సీవాలా రైడ్ ఎలా ఉందో చూద్దాం.

కథ :

అయిదేళ్ళు కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన శివ (విజయ్ దేవరకొండ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. ఫ్రెండ్ హెల్ప్‌తో పిజ్జా డెలివరీ బాయ్‌గా జాయిన్ అవుతాడు. కొద్ది రోజుల్లోనే ఆ జాబ్‌‌పై ఇంట్రెస్ట్ పోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో క్యాబ్ డ్రైవర్లు నెలకు లక్ష రూపాయల వరకూ సంపాదిస్తున్నారని తెలుసుకుని, అన్నా, వదినల సహాయంతో తన బడ్జెట్‌లో, ఒక ఓల్డ్ కార్ కొని రిపేర్లవీ చేయించి, రైడ్స్‌స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్‌రైడ్‌లోనే అను(ప్రియాంక జవాల్కర్) తో లవ్‌లో పడతాడు. అంతా సాఫీగా జరిగిపోతుండగా, ఓ శుభ ముహుర్తాన ఆ కార్‌లో దెయ్యం ఉందని తెలుస్తుంది. ఆ సంగతి ఎవరికి చెప్పినా నమ్మరు. ఇంతలో కార్ యాక్సిడెంట్ చేసి, ఒక ప్రాణాన్ని బలిగొంటుంది. ఇక అప్పటినుండి మనోడికి కొత్త కష్టాలు మొదలవుతాయి. ఆ పరిస్ధితుల్లో శివ ఏంచేసాడు, ఎలా ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడ్డాడు, శిశిర(మాళవికా నాయర్)‌కూ, శివకూ సంబంధం ఏంటి, అనేదే టాక్సీవాలా కథ 

 

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

విజయ్ దేవరకొండ ఎప్పటిలానే తన న్యాచురల్ పర్ఫారెన్స్‌‌‌తో, మంచి కామెడీ టైమింగ్‌తో, తన స్టైల్.. డైలాగ్ డెలివరీతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసాడు, టాక్సీవాలాగా క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్‌కి అతని స్టైలింగ్ అదీ కూడా నచ్చుతుంది. ప్రియాంక జవాల్కర్ లుక్స్‌వైజ్ బాగుంది. నటన పరంగా అద్భుతం అని చెప్పలేం, అలా అని తీసిపారెయ్యలేం. ఉన్నంతలో బాగానే చేసింది. మాళవికా నాయర్ రోల్ చిన్నదే అయినా, ఉన్నంతవరకూ తన ప్రత్యేకత చాటుకుంది. హీరో ఫ్రెండ్స్‌గా మధుతో పాటు, కొత్త కుర్రాడు విష్ణు చితక్కొట్టేసారు. విలన్‌గా సీనియర్ నటుడు సిజ్జు పర్వాలేదనిపిస్తే, రవివర్మ, రవి ప్రకాష్, ఉత్తేజ్, యమున, కళ్యాణిలవి చిన్న క్యారెక్టర్లే అయినా, ఉన్నంతలో చాలా బాగా చేసారు. జేక్స్‌బిజోయ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. మాటే వినదుగా తర్వాత ఆ రేంజ్ లో గుర్తు పెట్టుకునే సాంగ్ ఇంకోటి కనిపించదు. బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్ బాగా ఇచ్చాడు. సుజీత్ సారంగ్ ఫోటోగ్రఫీ సినిమా స్ధాయిని పెంచింది. మిగతా టెక్నికల్ టీమ్ అంతా మంచి ఎఫర్ట్ పెట్టారు. డైరెక్టర్ విషయానికొస్తే, మనోళ్ళకి ఎప్పుడో మెహం మెత్తేసిన హారర్ కామెడీని తన స్టైల్‌లో చెప్పడానికి సిద్ధపడ్డాడు. కానీ, తనేం చెప్పదల్చుకున్నాడో క్లారిటీగా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. రైటర్ సాయికుమార్ రెడ్డి టైట్ స్క్రీన్‌ప్లే‌తో, సిచ్చుయేషన్‌కి తగ్గ సంభాషణలతో, తన పెన్ పవర్ చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు టాక్సీవాలా రైట్ చాయిస్ అని చెప్పొచ్చు...

 

తారాగణం : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, మధు, విష్ణు, రవివర్మ, రవి ప్రకాష్, ఉత్తేజ్, యమున, కళ్యాణి తదితరులు 

 

 కెమెరా    :   సుజీత్ సారంగ్

 

 సంగీతం :   జేక్స్‌బిజోయ్

స్క్రీన్‌ప్లే, మాటలు :   సాయికుమార్ రెడ్డి 

 

నిర్మాత    :                    ఎస్.కె.ఎన్

కథ, దర్శకత్వం :       రాహుల్ సంక్రిత్యాన్


రేటింగ్     :    2.5/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

 

Don't Miss