ఎగ్జిట్ పోల్ : గెలుపు TRS పార్టీదే

18:26 - December 7, 2018

ఒక్క తెలంగాణానే కాదు.. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు విడుదల. ఓటరు తీర్పు ఇచ్చేశాడు.. వెల్లడించటానికి టైం ఉండటంతో జాతీయ, రాష్ట్ర సర్వే సంస్థలు, మీడియా ఏజెన్సీలు సర్వే రిపోర్టులను వెల్లడించాయి. తెలంగాణ ఎన్నికలపై ఆయా సంస్థల సర్వేల్లో వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణపై జాతీయ ఛానల్స్ సర్వేలు :

టైమ్స్ నౌ : టీఆర్ఎస్ 66, ప్రజా కూటమి 37, బీజేపీ 7, ఇతరులు 9
న్యూస్ 18 : టీఆర్ఎస్ 50-65, ప్రజాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14
ఇండియా టుడే - యాక్సిస్ : టీఆర్ఎస్ 79-91, ప్రజాకూటమి 21-33, బీజేపీ 1-3

ఎన్డీటీవీ  టీఆర్ఎస్ 69 ప్రజాకూటమి 37, ఇతరులు 4

రిపబ్లిక్ టీవీ   టీఆర్ఎస్ 50-65  ప్రజాకూటమి 38-52,  బీజేపీ 4-7 ఇతరులు 8-14

టైమ్స్ నౌ సర్వే అయితే వార్ వన్ సైడ్ అని తేల్చింది. మెజార్టీ అయిన 60 స్థానాల కంటే టీఆర్ఎస్ పార్టీ అదనంగా 6 సీట్లు కైవసం చేసుకుని మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. కూటమికి భారీ ఓటమి తప్పదని సంకేతాలు ఇచ్చింది.

Don't Miss