నేడు రాహుల్‌తో కోదండరాం భేటీ

09:45 - November 2, 2018

ఢిల్లీ : మహాకూటమి సీట్ల పంచాయతీ హస్తినకు చేరింది. మహాకూటమి నేతలు సీట్ల పంపకాలపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఢిల్లీలో మకాం వేశారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కోదండారం భేటీ కానున్నారు. రాహుల్‌తో భేటికి ముందే అశోక్ గెహ్లాట్, జైరా రమేశ్‌లతో ఆయన సమావేశం కానున్నారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై చర్చించనున్నారు. 

అయితే కోదండరాం కూటమిలో 15 సీట్లు కోరుతున్నారు. కాగా తాను బలంగా ఉన్న చోట సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇదిలావుంటే ఇప్పుడు కూటమిలోని మిత్ర పక్షాలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తే...రాబోయే ఎంపీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో అధిక సీట్లు అడిగే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా కోదండరాం అభ్యర్థనను రాహుల్ గాంధీ ఎంత వరకు ఒప్పుకుంటారనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

 

Don't Miss