నాగర్ కర్నూల్ జిల్లాలో టీఆర్ఎస్ కాంగ్రెస్ గొడవ

15:58 - December 7, 2018

నాగర్ కర్నూల్:  పోలింగ్ మరి కొద్ది గంటల్లో ముగుస్తుందనగా , జిల్లాలోని అచ్చంపేట మండలం రంగాపురం  గ్రామంలో  టీఆర్ఎస్ కాంగ్రెస్  కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  ఇరు వర్గాలు వీధుల్లోకి వచ్చి కర్రలతో దాడులు చేసుకున్నారు.  శుక్రవారం మధ్యాహ్నం పోలింగ్ ప్రశాంతగా జరుగుతుండగా టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్ది గువ్వల బాలరాజు, ఆయన భార్యతో కలిసి  పోలింగ్ బూత్ వైపు రావటంతో, బాలరాజు ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడని ఆరోపిస్తూ  కాంగ్రెస్ కార్యకర్తలు  ఆయనతో గొడవకు దిగారు.వెంటనే టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ వారితో ఘర్షణకు దిగారు. పరిస్ధితి గమనించిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్ధితి చక్కదిద్దారు.  

Don't Miss