బాక్సాఫీస్ బరిలో భీభత్సం సృష్టిస్తున్న సర్కార్

12:33 - November 8, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో మొన్న రిలీజ్ అయింది. తెలుగు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
అంతేకాదు, కేవలం రెండే రెండు రోజల్లో ఈ సినిమా అక్షరాలా రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. మొదటరోజు అన్నిచోట్లా హౌస్‌ఫుల్ బోర్డ్ పడగా, ప్రపంచవ్యాప్తంగా, రెండు రోజుల్లో, రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సర్కార్. మరోపక్క ఈ సినిమాలో విజయ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సీన్స్‌లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేసాడని తెలుగు ఆడియన్స్ అంటున్నారు. గతంలో, తమిళనాట విజయ్ నటించగా విజయం సాధించిన కొన్ని సినిమాలను పవన్, తెలుగులో రీమేక్ చేసాడు. పవన్ బంగారం ఆడియో ఫంక్షన్‌కి, విజయ్ గెస్ట్‌గా వచ్చాడు కూడా. అయితే సర్కార్‌లో విజయ్, పవన్‌లా,  ప్రశ్నిస్తా.. అనడంతో పాటు, అజ్ఞాతవాసి సినిమాలోలా, అహ్ అహ్ అంటూ చాలా వరకూ, పవన్‌ని అనుకరించాడు, అందుకే రెండు రోజుల్లో రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యగలిగింది అంటున్నారు కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్.. 

 

Don't Miss