మెగా పవర్ స్టార్- వినయ విధేయ రామ ఫస్ట్‌లుక్ రిలీజ్

13:46 - November 6, 2018

మెగా ఫ్యాన్స్‌ఎంతగానో ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, డివివి దానయ్య నిర్మిస్తున్న కొత్త సినిమాకి, వినయ విధేయ రామ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. పోస్టర్‌లో ఎప్పటిలానే బోయపాటి తన మాస్ మార్క్ చూపించగా, చెర్రీ ఎమోషనల్‌గా పరిగెడుతూ, ఒక చేత్తో కత్తి పట్టుకుని, మరో చేత్తో రెండో వెపన్‌ని ఎగరేస్తూ, ఉన్న స్టిల్ అభిమానులను అలరిస్తోంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  వినయ విధేయ రామలో చరణ్ పక్కన భరత్ అనే నేను భామ కియారా అడ్వాణి హీరోయిన్ కాగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేస్తున్నాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్(జీన్స్‌ఫేమ్), నవీన్ చంద్ర కీలక పాత్రలు చేస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. నవంబర్ 9వ తేదీ ఉదయం 10.25 నిమిషాలకు టీజర్ విడుదల చెయ్యనున్నారు. సంక్రాంతికి వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Don't Miss