మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామ టీజర్ రిలీజ్

11:12 - November 9, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా, వినయ విధేయ రామ. దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన మూవీ యూనిట్, ముందుగా చెప్పినట్టే ఈ ఉదయం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ మొత్తం, రామ్ చరణ్, బోయపాటి శ్రీను మాత్రమే కనబడతారు.  
అన్నాయ్ వీణ్ణి చంపెయ్యాలా, భయపెట్టాలా? భయపెట్టాలంటే పదినిమిషాలు, చంపెయ్యాలంటే పావుగంట, ఏదైనా ఓకే.. సెలెక్ట్ చేస్కో.. 
 ఏయ్, పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్, రామ్.. కొ..ణి..దె..ల.. అంటూ చరణ్ రెచ్చిపోయాడు. సరైనోడులో విలన్.. వైరం ధనుష్ అయితే, ఈ సినిమాలో పందెం పరశురామ్ అనుకోవచ్చు. బోయపాటి ఎప్పటిలానే తన ఊరమాస్ యాంగిల్‌లో అదరగొట్టేసాడు. ఎం. రత్నం తన మార్క్ మాస్ డైలాగ్స్ వ్రాసారు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్(జీన్స్‌ఫేమ్), చరణ్ అన్నయ్యలుగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేసాడు. టీజర్‌కి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  వినయ విధేయ రామలో చరణ్ పక్కన భరత్ అనే నేను భామ కియారా అడ్వాణి హీరోయిన్ కాగా, స్నేహ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2019 సంక్రాంతికి వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

Don't Miss