రజనీకాంత్ ని కలిసిన మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్

21:32 - November 2, 2018

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో  బాక్సింగ్ మహిళా దిగ్గజం మేరీకోమ్ బాక్సింగ్ కి తలపడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్ భార్య లత  చిన్న పిల్లల కోసం "శ్రీదయ" అనే ఫౌండేషన్ ను స్ధాపించారు. ఫౌండేషన్  ప్రారంభోత్సవానికి విచ్చేసిన మేరీ కోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీ ఇంటికి వెళ్లి కాసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం రజనీ, మేరీ కోమ్ ఇద్దరు కలిసి బాక్సింగ్ కి తల పడుతున్నట్లు ఫోజులిచ్చారు. ఆఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నాయి. ప్రముఖ తమిళ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన "2 ఓ"  ట్రైలర్‌ను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఈనెల 29న విడుదల కానున్నఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

Don't Miss