బ్యాండ్ 3 వాచ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌లను విడుదల చేసిన జియోమీ

12:32 - September 28, 2018

బెంగళూరు: చైనాకు చెందిన ప్రసిద్ధ మొబైల్ ఫోన్ కంపెనీ జియోమి రెండు కొత్త ఉత్పత్తులను భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

జియోమీ మీ బ్యాండ్ 3 రిస్ట్ వాచ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌లను శుక్రవారం ఇండియాలో విడుదలచేసింది. మధ్యాహ్నం 12 గంటలనుంచి ఈ ఉత్పత్తుల అమ్మకాలు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు మీ హోమ్ స్టోర్‌లో లభ్యమవుతాయి. ఈ సందర్భంగా బెంగుళూరులోని కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ రెండు ఉత్పత్తులతోపాటు మీ టీవి, మీ లగేజీ, మీ హోమ్ కెమేరా 360లను విడుదల చేశారు.  అయితే ఈ ఉత్పత్తులు వచ్చే వారంలో అమ్మకాలు ప్రారంభించనున్నారు.

ధరలు:  జియోమీ మీ బ్యాండ్ 3 రిస్ట్‌వాచ్ ధర రూ 1999 కాగా.. ఎయిర్ ప్యూరిఫైయర్‌ 2ఎస్ ధర రూ.8999 గా నిర్ణయించారు.  

Don't Miss