జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఏడాది

12:27 - November 6, 2018

హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మంగళవారంతో ఏడాది పూర్తిచేసుకుంది. కడప జిల్లాలోని ఇడుపులపాయలో గత ఏడాది నవంబర్ 6 న ప్రారంభమైన సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో  ముగియాల్సిఉంది.  ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ వద్ద ప్రారంభం కాగా ఇచ్చాపురంలో రాజశేఖర్ రెడ్డి 2003 సంవత్సరంలో 1,475 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసిన ప్రాంతంలో యాత్ర ముగుస్తుంది. 
ప్రజలకు వైసీపీ ఎజెండా తెలుపుతూ... ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ప్రతిపక్షనాయకుడి హోదాలో జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యం. 
గత 294 రోజులుగా, జగన్‌మోహన్ రెడ్డి 3,211 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 122 పూర్తి చేయడం విశేషం. పదకొండు జిల్లాల్లో..1,739 గ్రామాలను సందర్శించి.. 205 మండలాల్లో ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా 113 బహిరంగ సభలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిచడం ఒక మైలురాయిగా చెప్పుకోవాలి. 
ప్రధానంగా, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధిక సంఖ్యలో ప్రజలు, అధికారులు, రాజకీయనేతలు పార్టీలో చేరడం విశేషం.

Don't Miss