ముద్దు హద్దు దాటింది: ముద్దులు పెట్టుకుంటూ చనిపోయిన ప్రేమ జంట

Submitted on 15 August 2019
Couple fall to their deaths as they tumble over bridge fence while kissing

ప్రేమలో పడితే ప్రపంచమే తెలీదు అంటారు. ప్రేమికులు ప్రేమ కోసం ఎంతటి సాహసాలకైనా తెగిస్తారు అని వింటూ ఉంటాం. ముద్దుల్లో మునిగిపోయిన ఓ ప్రేమ జంట కూడా ప్రపంచాన్ని మరిచిపోయింది. అయితే హద్దులు దాటిన ముద్దు మాత్రం ప్రేమికుల ప్రాణాలను తీసుకుంది.  ముద్దుల్లో మునిగిపోయిన ప్రేమికులు ప్రమాదవశాత్తు 50 అడుగుల బ్రిడ్జిపై నుంచి కిందపడి చనిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. పెరూ దేశంలో మేబిత్‌ ఎస్పింజ్‌(34), హెక్టార్‌ విడాల్‌(36) అనే పర్వతారోహకులు ఇద్దరు ప్రేమికులు. వీరిద్దరు క్యూసో పట్టణంలో టూరిస్టు గైడ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల ఇద్దరు విధులు ముగించుకుని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తమ నివాసాలకు వెళ్తున్నారు. అయితే ఇంటికి వెళ్తూ మద్యలో బెత్లెహాం బ్రిడ్జిపై ముద్దులు పెట్టుకునేందుకు ఆగారు. ఘాడంగా ముద్దుల్లోకి దిగిపోయిన ప్రేమ జంట ప్రపంచాన్ని మరిచిపోయి హద్దులు దాటేశారు.

ప్రియురాలు బ్రిడ్జ్ రెయిలింగ్‌పై కూర్చొని ఉండగా, ప్రియుడు ఆ రెయిలింగ్‌ను సపోర్ట్‌ చేసుకుని నిలబడి ముద్దులు పెడుతున్నాడు. ప్రియురాలు ప్రియుడు ముద్దు పెట్టుకుంటున్న క్రమంలోనే వారిద్దరూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డారు. 50 అడుగుల పైనుంచి కిందపడేసరికి ప్రియురాలు అక్కడికక్కడే చనిపోగా, ప్రియుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

couple
deaths
Bridge
kissing

మరిన్ని వార్తలు