భయపడినట్లే జరిగింది :హైకోర్టు బయటే...సాక్షి దంపతుల కిడ్నాప్

Submitted on 15 July 2019
Couple seeking protection kidnapped at gunpoint outside Allahabad court

యూపీ బీజేపీ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా(23)  కులాంతర వివాహం విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త అజితేష్ కుమార్‌(29) ప్రాణానికి ప్రమాదం ఉందంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న సాక్షి మిశ్రాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టు గుమ్మం తొక్కిన  ఈ జంటను సోమవారం(జులై-15,2019) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు బయట కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది.
Also Read : BJP MLA వ్యాఖ్యలు:ముస్లింలు 50పెళ్లిళ్లు చేసుకుని..వేలమంది పిల్లల్ని కంటారు

అలహాబాద్ హైకోర్టులో సాక్షి దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు రావడంతో యువ జంట కోర్టు గేట్ నంబర్ 3 వెలుపల వేచి వుండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు  బ్లాక్‌ ఎస్‌యూవీలో వచ్చి  తుపాకీ గురిపెట్టి మరీ వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉదయం 8.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం...యూపీ 80 అనే రిజిస్ట్రేషన్ నంబర్‌గల ఎస్‌యూవీ వెనుక  ‘చైర్మన్’ అని రాసి ఉంది. సీసీటీవీ  ఫుటేజీని స్కాన్ చేస్తున్నామని, వాహనాల తనిఖీ ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దంపతులు  ప్రస్తుతం ఎక్కడ ఉన్నదీ తమ వద్ద సమాచారం లేదనీ, ఆచూకీ గురించి  తెలియజేస్తే, వారికి భద్రత కల్పిస్తామని స్పెషల్ పోలీస్ సూపరింటెండెంట్ బరేలీ మునిరాజ్ చెప్పారు. 

మరోవైపు వీరిద్దరి వివాహానికి సహాయం చేసిన వారి స్నేహితులలో ఒకర్ని 2018లో ఒక కేసుకు సంబంధించి అరెస్టు చేయడం గమనార్హం. ఇతను ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా తండ్రికి సన్నిహితుడని చెబుతున్నారు. అటు అజితేష్ కుమార్ తండ్రి హరీష్ కుమార్ తమ కొడుకు కోడలి ఆచూకీ తెలియదనీ, వారి ప్రాణాలకు ముప్పు వస్తుందనే భయంతో కుటుంబంతో సహా తాను బరేలీని విడిచి దూరంగా వెళ్లిపోయామని వాపోయారు.

అయితే ఇదిలా వుంటే స్వాతి, అజితేష్‌  వివాహాన్ని చట్టబద్దమైందిగా అలహాబాద్‌ హైకోర్టు   ప్రకటించింది.  అలాగే వారికి తగిన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి  ప్రయత్నాలు చేసిందని  ప్రశ్నించింది. 

దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు, తన తండ్రి ద్వారా తమకు ప్రాణహాని వుందని, ఇప్పటికే అనేక బెదిరింపులు ఎదురయ్యాయంటూ సాక్షి మిశ్రా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భర్త అజితేశ్‌తో కలిసి ఆమె సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సాక్షి మిశ్రా తండ్రి రాజేశ్ మిశ్రా బరేలీ జిల్లా బితారీ చైన్‌పూర్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read : వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కియా ఏపీకి: జగన్‌కు లేఖ రాసిన కియా సీఈఓ

Allahabad
High Court
outside
rajesh misra
kidnap
UP
BJP
MLA
barely
sakshi misra
couple
SUV

మరిన్ని వార్తలు