కొత్తగూడెం స్థానంపై పట్టువీడని కామ్రెడ్స్..

10:40 - November 9, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో భాగస్వామిగా వున్న వామపక్ష పార్టీ సీపీఐ తనకు కావాల్సిన..పట్టు వున్న స్థానమైన కొత్తగూడెం స్థానంపై పట్టుపట్టుకుని కూర్చుంది. ఎలాగైనా తమకు కొత్తగూడెం స్థానం కేటాయించాల్సిందేననీ..లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీపీఐ కార్యాలయం అయిన మగ్ధూంభవన్ లో జరగనున్న నేపథ్యంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ సీపీఐకి నాలుగు అసెంబ్లీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీ సీట్లను  డిమాండ్ చేసింది కానీ కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలకు మాత్రమే కేటాయించింది. దీంతో హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి సీట్లను మాత్రమే కేటాయించింది. కానీ బెల్లంపల్లి స్థానానికి బదులుగా మంచిర్యాల స్థానాన్ని కోరటంతోపాటు కొత్తగూడెం స్థానంపై మాత్రం తమ పట్టు వీడటంలేదు. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోకుంటే ఒంటరి పోరుకు సీపీఐ సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. 
తెలంగాణ, ఎన్నికలు, మహాకూటమి, సీపీఐ, కొత్తగూడెం,అసెంబ్లీ స్థానం, 

 

Don't Miss