ఏళ్ల నాటి కల: ఒలింపిక్స్‌లోకి క్రికెట్

Submitted on 15 August 2019
Cricket Set To Be Included In 2028 Los Angeles Olympics

చాలా సంవత్సరాలుగా ఒలింపిక్స్‌లోకి క్రికెట్ తేవాలని భావిస్తున్న ఐసీసీ మరింత త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వినిపించనుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ సన్నాహాలు చేస్తోందట. ఇంగ్లాండ్‌లోని మెరైల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) జరిపిన సమావేశంలో ఇదే విషయంపై చర్చించారు. 

ఎంసీసీ చైర్మన్ మైక్ గాట్టింగ్ మాట్లాడుతూ రాబోయే ఏడాదిన్నర కాలంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఒలింపిక్స్‌కు అర్హత ఎలా పొందాలి దశల వారీగా క్వాలిఫైయర్స్‌ను ఎలా నిర్ణయించాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లుగా గాటింగ్ వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో క్రికెట్‌ను నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. 

ఒలింపిక్స్‌లో క్రికెట్ తొలిసారి 1900సమ్మర్ ఒలింపిక్స్‌లో నిర్వహించారు. రెండు రోజుల పాటు గ్రేట్ బ్రిటన్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ గేమ్‌లో 158 పరుగుల తేడాతో బ్రిటన్ గెలిచింది. కానీ, 1912లో క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించింది. 1900కు ముందు జరిగిన ఒలింపిక్స్ అంటే 1896లో జరిపిన ఒలింపిక్స్‌లోనూ క్రికెట్ ఉన్నప్పటికీ జట్లకు సరిపడ ప్లేయర్స్ లేరని క్రీడల జాబితా నుంచి క్రికెట్ ను తొలగించారు. 

cricket
2028 Olympics
Olympics
los angeles

మరిన్ని వార్తలు