OMG : ఇంటిపైకెక్కిన మొసలి 

Submitted on 12 August 2019
crocodile lands on roof of a house in flood-affected Raybag taluk in Belgaum Karnataka

కర్ణాటకను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో రెండు వేలకు పైగా గ్రామాలు వరద నీటిలో ముంపునకు గురయ్యాయి. వరద నీటితో పాటు పట్టణాల్లోకి, గ్రామాల్లోకి విషసర్పాలు.. మొసళ్లు వచ్చేస్తున్నాయి. బెల్గాం జిల్లా రాయ్‌బాగ్‌ తాలుకా పరిధిలోని ఓ గ్రామంలోకి మొసళ్లు వచ్చాయి. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో.. మొసళ్లు ఇండ్ల కప్పులపైకి చేరాయి. ఇల్లు మొత్తం మునిగి.. కేవలం పైకప్పు మాత్రమే కనిపిస్తోంది. దానిపై మొసలి తీరిగ్గా కూర్చుకోవటంతో అందరినీ షాక్ కు గురి చేసింది.

ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4, 5 రోజులుగా.. ఇళ్లన్నీ నీళ్లల్లోనే ఉన్నాయి. కంపు కొడుతున్నాయి. జలచరాలన్నీ ఇళ్లల్లో తిష్ట వేశాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. నీళ్లు తగ్గిన తర్వాత ఇళ్లల్లోకి ఎలా వెళ్లాలనే ఆందోళన ఇప్పటి నుంచే పట్టుకుంది. బురద, పాములు, తేళ్లు, మొసళ్లు వీధుల్లో తిరుగుతున్నాయి. వరదల ధాటికి ఇప్పటికే 40 మంది చనిపోయారు. మరో 14 మంది గల్లంతయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో వరదనీటితో పాటు కొట్టుకువచ్చిన మొసళ్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

Crocodile
lands
house roof
flood-affected
Belgaum
karnataka

మరిన్ని వార్తలు