మీరు గ్రేట్ సార్: కానిస్టేబుల్ పాడె మోసిన కమీషనర్ సజ్జనార్

Submitted on 13 June 2019
Cyberabad CP Sajjanar carried hearse of constable

పై అధికారులు అంటే కిందిస్థాయి ఉద్యోగులతో దారుణంగా ప్రవర్తిస్తారు అంటుంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో అసలు కింది స్థాయి ఉద్యోగులకు గౌరవం ఇవ్వరు అంటుంటే వింటుంటాం. అయితే సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ చేసిన పనికి నెటిజన్లు సలాం పోలీస్ అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్న తులసీరామ్ ప్రాణాలు కోల్పోయారు. తులసిరామ్ అంత్యక్రియలు గురువారం జరిగాయి.

అంత్యక్రియలలో పాల్గొన్న సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్.. కానిస్టేబుల్ తులసిరామ్ పాడెను మోశారు. కమీషర్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా కానిస్టేబుల్ పాడెను మోశారు. విధి నిర్వహణలో భాగంగా తెలంగాణ పోలీసులు బీహార్‌కు వెళ్ళి కాటేదాన్‌లో జరిగిన రేప్ కేసు నిందితుడిని తీసుకుని వస్తుండగా మధ్యప్రదేశ్‌లో వారి వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ తులసీరామ్ ప్రాణాలు కోల్పోయారు.

కాగా హైదరాబాద్‌లో జరిగిన కానిస్టేబుల్ అంత్యక్రియలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విధి నిర్వహణలో అమరుడైన తులసీమ్‌కు .. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ తులసీరామ్ పాడెను కమీషనర్ సజ్జనార్ తన భుజాలపై మోశారు. ఈ సంధర్భంగా కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం, పోలీస్ డిపార్టుమెంట్ ఆదుకుంటుందని సజ్జనార్ అన్నారు.
 

Cyberabad CP Sajjanar
carried hearse
Constable
Tulasi Ram

మరిన్ని వార్తలు