‘వాయు’ తుఫాన్ ఎఫెక్ట్ : 77 రైళ్లు రద్దు

Submitted on 13 June 2019
Cyclone Vayu effect..77 trains canceled

అరేబియా సముద్రంలో నెలకొన్ని వాయు తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ 77 రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  

పశ్చిమ రైల్వే మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికుల కోసం తగిన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. దీంట్లో భాంగా రెండు రైళ్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. రాజ్‌కోట్ డివిజన్, భావ్‌నగర్ డివిజన్ ప్రాంతంలో ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొన్నారు.

Gujrath
cyclone
vayu
effect
77 trains
Canceled
Western Railway

మరిన్ని వార్తలు