గుజరాత్ తీరంలో హైఅలర్ట్ : దూసుకోస్తున్న వాయు తుఫాన్

Submitted on 12 June 2019
Cyclone Vayu : Gujarat, Diu to evacuate 3 lakh people, Mumbai to get very heavy rainfall

వాయు తుఫాన్ వణుకుపుట్టిస్తోంది. గుజరాత్ సముద్ర తీర ప్రాంతానికి వాయు తుఫాన్ దూసుకోస్తోంది. వాయు తుఫాన్ ఉత్తర దిశ నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బుధవారం (జూన్ 12) ఉదయం కేంద్రీకృతం కానుంది. పశ్చిమ వాయువ్య గోవాకు 450కిలోమీటర్ల వేగంతో.. దక్షిణ నైరుతి ముంబైకి 290 కిలోమీటర్ల వేగంతో తుఫాను దూసుకోస్తోంది.

ఇప్పటికే హోంశాఖ.. అధికారులను అప్రమత్తం చేయగా NDRF సిబ్బంది, రెస్క్యూ టీం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి. గుజరాత్ తీరం మీదుగా పోర్ బందర్, మహువా, వెర్వాల్, డియూ రిజియన్ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దీంతో గుజరాత్ తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. 

3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు : 
వాయు తుఫాన్ 140-150 కిలోమీటర్ల వేగం నుంచి 165 కిలోమీటర్ల వేగంతో దూసుకోస్తోంది. జూన్ 13 (గురువారం) గుజరాత్ తీరాన్ని వాయు తుఫాన్ తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో అత్యంత వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని 3 లక్షల మంది ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి అధికారులు ప్రజలను తరలించే పనిలో పడ్డారు.  

రంగంలోకి NDRF బృందాలు :
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) నుంచి 39 బృందాలు మోహరించగా.. 45 వరకు రెస్య్కూ సిబ్బంది చేరుకున్నారు. గుజరాత్, డియూ ప్రాంతాల్లో పడవలు, ట్రీ కట్టర్స్, టెలికం సామాగ్రితో చేరుకున్నారు. ఆర్మీ నుంచి 34 బృందాలు కూడా మోహరించారు. మరోవైపు ఐఎఎఫ్ సి-17 ట్రాన్స్ ఫోర్టర్ ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది కూడా మోహరించారు. తుఫానులో చిక్కుకున్న వారిని రక్షించి వాయు మార్గంలో తరలించేందుకు HADR సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముంబై తీరాన్ని తాకిన వాయు తుఫాన్ ప్రభావంతో నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబై వాతావరణ శాఖ తెలిపింది. 

ముంబైలో అలర్ట్ : భారీ వర్షాలు :  
కొంకన్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ముంబై తీరం నుంచి ఉదయం నుంచి 250 కిలోమీటర్ల వేగం నుంచి 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీని ప్రభావంతో ముంబై, కొంకన్, థానే, పల్గహర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయు తుఫాన్ ప్రభావంతో ముందుగానే ముంబై పోలీసు, కోస్ట్ గార్డ్, భారత నేవీ.. ముంబైలో అలర్ట్ ప్రకటించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్సకారులను వెనక్కి రప్పించారు. 

Cyclone Vayu Updates
Gujarat
Diu to evacuate 3 lakh people
Mumbai
heavy rainfall

మరిన్ని వార్తలు