వార్నర్ విధ్వంసం : వరల్డ్ కప్ లో సరికొత్త రికార్డ్

Submitted on 20 June 2019
david warner world record

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరల్డ్ కప్ లో వరల్డ్ రికార్డ్ సాధించాడు. బంగ్లాదేశ్‌తో నాటింగ్‌ హామ్ వేదికగా గురువారం(జూన్ 20,2019) జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం(166 రన్స్) బాదిన డేవిడ్ వార్నర్ అరుదైన క్లబ్ లో చేరాడు. వరల్డ్‌ కప్‌ చరిత్రలో రెండు సార్లు 150+ స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో 147 బంతుల్లో వార్నర్ 166 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 2015 ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్థాన్‌పై వార్నర్ 178 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే.

బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగులు బాదిన వార్నర్.. బంగ్లాదేశ్‌పైనా సెంచరీ సాధించాడు. వార్నర్ విధ్వంసంతో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్ చేసింది.

వార్నర్ మరో ఘనత కూడా సాధించాడు. వన్డేల్లో 6సార్లు 150కిపైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ 6సార్లు కూడా 6 దేశాలపైనే చేయడం విశేషం. ఈ జాబితాలో భారత విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ టాప్ లో ముందున్నాడు. రోహిత్ 7 సార్లు 150+ పరుగులు చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్, క్రిస్ గేల్ 5 సార్లు.. ఆమ్లా, జయసూర్య, కోహ్లి 4 సార్లు ఈ ఫీట్ సాధించారు.

david warner
World Record
World Cup
bangladesh
150 runs
rothi sharma

మరిన్ని వార్తలు