పెళ్లి చేసుకున్న అమలాపాల్ మాజీ భర్త

Submitted on 12 July 2019
Director AL Vijay Second Marriage With Doctor Aishwarya In Chennai

త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ తెలుసుకదా? అదేనండీ అమలాపాల్ మాజీ భర్త. ఆయనకు గురువారం (జులై 11, 2019) చెన్నైలో వివాహం అయ్యింది. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే డాక్టర్ ని ఆయన రెండవ పెళ్ళి చేసుకున్నారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వేడుక‌కి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. 

విజయ్ 2014లో హీరోయిన్ అమలాపాల్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరికి వారు బతికేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ - అమలాపాల్ కొద్దికాలానికే వేరుపడ్డారు. ఆ తర్వాత అమలాపాల్ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు విజయ్ మళ్లీ పెళ్లి చేసుకుని  ఓ ఇంటివాడు అయ్యాడు. 

ప్రస్తుతం విజయ్...దేవి 2 సినిమాతో పాటు జ‌య‌ల‌లిత బయోపిక్ చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుల కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా న‌టిస్తుంది. హిందీలో ‘జయ’ టైటిల్‌తో, తమిళంలో ‘తలైవి’ టైటిల్‌ తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Director AL Vijay
second marriage
Dr Aishwarya
Chennai

మరిన్ని వార్తలు