నిరసనగా ఒక్కరోజు పిల్లలను స్కూల్‌కు పంపొద్దు: బాలల హక్కుల సంఘం పిలుపు

Submitted on 13 June 2019
Don't send one day to school as a protest: Child Rights Council

హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఓ స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థిని చనిపోయిన ఘటనపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌లో టెన్త్ విద్యార్థిని వివిత మృతికి నిరసనగా శుక్రవారం(14 జూన్ 2019) విద్యార్థులను పాఠశాలలకు పంపవద్దని, స్వచ్ఛంద బంద్ పాటించి నిరసన వ్యక్తం చేయాలని బాలల హక్కుల సంఘం పిలుపునిచ్చింది.

పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని, ఘటన జరిగిన నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం(13 జూన్ 2019) ఉదయం 10వ తరగతి విద్యార్థి వినిత.. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి నాగార్జున స్కూల్‌కు వెళ్లగా.. ఉ. 9గంటలకు కుటుంబ సభ్యులకు యాజమాన్యం కళ్లు తిరిగి పడిపోయినట్లు ఫోన్ చేసి తెలిపింది.

కామినేని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పగా.. ఆస్పత్రికి వెళ్లాక 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయినట్లు తల్లిదండ్రులకు తెలపారు. దీంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు పడిందా.. కావాలని దూకేసిందా.. ఈ ప్రమాదం వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. 

one day to school Bundh
Protest
Child Rights Council

మరిన్ని వార్తలు