ఈ రోజే లాస్ట్ డేట్: DRDO లో టెక్నీషియన్స్ జాబ్స్

Submitted on 26 June 2019
DRDO Recruitment 2019 - Apply Online for 351 Technician - A Posts

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 351 టెక్నీషియన్-A పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఈ రోజే (జూన్ 26, 2019) చివరితేది. అభ్యర్ధులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా కేంద్రాలు: 
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైతో పాటు దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

విద్యార్హత: 
అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ITI లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలని అధికారులు వెల్లడించారు.

వయసు: 
అభ్యర్ధుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వు కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు ప్రారంభం: జూన్ 3, 2019.

దరఖాస్తు చివరితేది: జూన్ 26, 2019.

ఆన్ లైన్ దరఖాస్తు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

DRDO Recruitment
Apply Online
Technician - A Posts
2019

మరిన్ని వార్తలు