కంటికి కనిపించని గాలి నుండి తాగునీరు తయారీ..

14:15 - December 5, 2018

దుబాయ్‌ :  నీరు సమస్త ప్రాణికోటికి జీవనాధారం. నీరు భూగ్రహంపై 70 శాతం వరకు  ఆవరించి ఉన్న మూలకం. నీరు ద్రవ, ఘన మరియు వాయు రూపంలో లభిస్తుంది. వాయువు అంటే గాలి. గాలి రూపంలో లభించే నీరు కంటికి కనింపించదు. మరి కంటికి కనిపించని నీటిని మనం ఎలా తాగుతాం? అనే ప్రశ్న రాకమానదు. దీనికి పరిష్కారాన్ని కనుక్కుని నీటి కష్టాల నుండి బైటపడేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయ్ అంటే భూతల స్వర్గం. ఈ స్వర్గంలో నీరు కంటే పెట్రోలియమే ఎక్కువగా వుంటుందనే సంగతి తెలిసిందే. దీంతో నీటి కొరతను తీర్చుకునేందుకు దుబాయ్ లోని అబ్దుల్లా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.  

నీటి జాడ లేని ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తీర్చడం ప్రభుత్వాలకు సవాలనే చెప్పాలి. దీంతో వారు ప్రత్యామ్నా పద్ధతులను అవలంభించక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా భూమిపై ఉన్న గాలిలో సుమారు 13 ట్రిలియన్‌ టన్నుల నీరు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.  గాలిలోని తేమను తీసుకుని అందులో వుండే సాంద్రతను నీరుగా మార్చేందుకు తక్కువ ఖర్చుతో గ్రహించి అందులోనుంచి ఉప్పు నీటిని అందిస్తుందని తెలిపారు. ఉప్పును వేరుచేసి ఒక హైడ్రోజెల్‌లోకి చేరుస్తారు. అలా  ఒడిసిపట్టిన నీటి ఆవిరిని స్వాధీనం చేసుకోవడానికి ఆ పరికరానికి చిన్న కార్బన్‌ ట్యూబ్‌లను అమరుస్తారు. నానో ట్యూబ్‌లు సూర్యరశ్మిని గ్రహించి, నీటి ఆవిరిని స్వాధీనం చేసుకుంటాయి. ఈ నమూనా పరికరంతో రోజుకు సుమారు 3 లీటర్ల నీటిని ఒడిసి పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. కాగా గతంలోనే మన హైదరాబాద్ కుర్రాడు గాలి నుండి తాగునీటిని తయారు చేసిన విషయం తెలిసిందే. 
 

Don't Miss