మందుబాబు మానవత్వం: పక్షిపిల్లను కాపాడేందుకు క్యాబ్

Submitted on 12 July 2019
http://www.10tv.in/node/17113/edit

మద్యం తాగిన మైకంలో ఉండి కూడా ఓ మందు మానవత్వాన్ని చాటుకున్నాడు. గాయపడి రోడ్డుపై పడిఉన్న ఓ చిట్టి పిట్టను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నాడు. దాని కోసం క్యాబ్ బుక్  చేసుకుని మరీ ఆ పక్షిపిల్లను  వన్యప్రాణి పునరావాస కేంద్రానికి పంపించాడు. ఇది అమెరికాలో జరిగింది.

మద్యం తాగిన మైకంలో నేరాలకు పాల్పడిన ఘటనల గురించి టీవీలలో చూశాం..పత్రికలలో చదివి ఉంటాం. సాధారణంగా మద్యం తాగేవారిపై మంచి అభిప్రాయం ఉండదు. అది అమెరికాలో అయినా..అనకాపల్లిలో అయినా మందుబాబులపై ఉండే అభిప్రాయం అదే. ఇటువంటి ఈ పక్షిపిల్ల వ్యవహారంలో కూడా జరిగింది. గాయపడిన పక్షి పిల్ల విషయంలో కూడా అమెరికా వన్యప్రాణి సంరక్షకులు కూడా అలాగే అనుకున్నారు. 

పక్షిపిల్ల విషయంలో అమెరికాలోని ఉత్తర ఉటాకు చెందిన వన్యప్రాణి పునరావాస కేంద్రం సిబ్బంది మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఓ పక్షి పిల్ల గాయపడి ఉందనీ  తమకు ఓ వ్యక్తి ఫోన్ వచ్చిందని..కానీ ఆ ఫోన్ చేసిన వ్యక్తి మద్యం తాగిఉన్నాడని అతని మాటలద్వారా అర్థం అయిందనీ..కానీ రోడ్డుపై గాయపడి ఉన్న పక్షిని క్యాబ్‌లో తమ వద్దకు పంపుతున్నట్లు చెప్పాడని వారు అన్నారు. 

తాగిన మైకంలో కూడా సదరు వ్యక్తి గాయపడిన పక్షి పట్ల చూపిన ప్రేమ,దాన్ని కాపాడాలనే అతని తపన తమకు అర్థమైందన్నారు.  ఈ ఘటనపై ఉటా వన్యప్రాణి పునరావాస కేంద్రం తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. కాగా ఆ పక్షికి 'పెటే' అనే పేరు పెట్టామని వ్యన్యప్రాణి కేంద్రంవారు తెలిపారు. ప్రస్తుతం పక్షిపిల్ల పూర్తిగా కోలుకుందని పునరావాస కేంద్రం డైరెక్టర్ డాలిన్ మార్తలర్ తెలిపారు. ఈ సందర్భంగా పక్షిని కాపాడిన వ్యక్తికి డాలిన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. 
 

Drunk Man
Injured Bird saved & Books It To A Wildlife Rehab Center


మరిన్ని వార్తలు