డ్రంక్ అండ్ డ్రైవ్ : ట్రాఫిక్ పోలీస్‌ను కిడ్నాప్ చేసి.. రాత్రంతా తిప్పిన తాగుబోతులు

Submitted on 17 July 2019
Drunk men kidnap traffic cop, take him on 'joyride' in Mumbai

డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది అంటే చాలు కిలోమీటర్ ముందే కిక్ దిగుతుంది. పోలీసులు చేసే యాక్షన్ సీన్లకు చిరాకు వస్తోంది. ఇప్పుడు చెప్పబోయే సంగతి మాత్రం అందుకు ఫుల్ రివర్స్. ఈస్ట్ ముంబై చెంబూర్ ఏరియాలోని చడ్డా నగర్ ఉంది. ఆ ఏరియాలో ఓ కారు రోడ్డుకు అడ్డంగా ఆపి ఉంది. ఇందులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి.. కారు తీయ్ అంటూ దబాయించాడు. కూల్ బయటకు ముగ్గురు కుర్రోళ్లు దిగారు.

అప్పటికే ముగ్గురు బాగా తాగి ఉన్నారు. కారును నడిరోడ్డుపై అడ్డంగా ఆపి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ పిడిగుద్దులు గుద్దారు. కారు లోపల ఎత్తి పడేశారు. కారు అక్కడి నుంచి రయ్ అని దూసుకెళ్లింది. హైస్పీడ్ గా కారులో రాత్రంతా తిప్పేశారు. కిడ్నాప్ అయిన ట్రాఫిక్ పోలీసు.. వాకీ టాకీ ద్వారా పోలీసు కంట్రోల్ రూంకు వరుసగా మెసేజ్ లు పంపాడు. 

సమాచారం అందుకున్న విక్రోలీ ట్రాఫిక్ పోలీసులు కారును ఛేజ్ చేశారు. ఈస్టరన్ ఎక్స్ ప్రెస్ హైవేకు సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో కారును ఛేదించి పోలీసులు పట్టుకున్నారు. కారులోని ముగ్గురిలో ఒకడు పారిపోగా.. మిగిలిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజున పారిపోయిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ముగ్గురు కుర్రాళ్లను మేజిస్ట్రేయల్ కోర్టులో హాజరుపరిచారు.

ఈ ముగ్గురు థానెలోని ఘాడ్ బందర్ రోడ్డు నివాసితులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక యువకుడి తండ్రి ఇటీవల గిఫ్ట్ గా కారు కొని ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. జాయ్ రైడ్ పేరుతో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసునే కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. 

Drunk men
kidnap traffic cop
joyride
traffic policeman
heavily drunk

మరిన్ని వార్తలు