మృత్యువునే మోసగించారు : ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. శిఖరాన్ని చేరిన తెలంగాణ యువకులు

Submitted on 8 June 2019
‘Each step was a struggle’: 2 from T cheat death to scale Mt Everest

ఎవరెస్ట్ పై భారీ ట్రాఫిక్ జాం.. గడ్డ కట్టేంత చలి.. అత్యంత ప్రతికూల వాతావరణం... ఆక్సిజన్ తగినంత స్థాయిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కష్టమే. ప్రాణాలను లెక్కచేయలేదు. వెంట వచ్చిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు. వెనక్కి తగ్గలేదు. ఊపిరి బిగబట్టి గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ధైర్యంతో ముందుకు దూసుకెళ్లారు. మృత్యువునే మోసగించి.. చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణకు చెందిన ఇద్దరు పర్వతారోహకులు సత్తా చాటారు. పర్వత అధిరోహణలో తమకు తిరుగులేదని నిరూపించారు. 
Also Read : పేషెంట్ పగ : దురద తగ్గలేదని డాక్టర్ భార్యను చంపేశాడు

ఆ ఇద్దరే.. తెలంగాణకు చెందిన జి.తిరుపతి రెడ్డి (24), అమ్గోత్ తుకారం (20). మే 22న ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన వీరిద్దరూ ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా 8వేల 848 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో తమకు ఎదురైన ప్రతికూల అనుభవాలపై మీడియాతో మాట్లాడారు.

ప్రతి అడుగూ పోరాటమే :
తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే సమయంలో ప్రతి అడుగు పోరాటంగా సాగింది. గడ్డు కట్టేంత ఉష్టోగ్రతలను తట్టుకుంటూ ముందుకు సాగాం. శిఖరాన్ని చేరేందుకు భారీ సంఖ్యలో పర్వతరోహకులు తరలివచ్చారు. ట్రాఫిక్ జాం ఏర్పడింది. గంటల పాటు నిలబడి వేచి ఉండాల్సి వచ్చింది’ అని చెప్పాడు. 

ఒంటికాలితో శిఖరంపైకి :
తుకారం మాట్లాడుతూ.. శిఖరాన్ని అధిరోహించే సమయంలో తనకు ఎదురైన అనుభవాలను తెలిపాడు. శిఖరంపైకి ఎక్కేటప్పుడు తన కుడి కాలు విరిగింది. దీంతో తన శరీర బరువును కూడా తాను మోయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ఎడమ కాలిపైనే తన బరువును బ్యాలెన్స్ చేసినట్టు చెప్పాడు. మంచుపై ఎక్కేందుకు పాదాలకు ధరించిన లోహపు కొక్కెం సాయంతో మెల్లగా ఎక్కినట్టు తెలిపాడు. ప్రతికూల వాతావరణంలో తాను ఎలా శిఖరాన్ని చేరుకోగలిగానో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు. సౌత్ కోల్ రూట్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సౌత్ ఇండియాకు చెందిన యువ పర్వతారోహకుడిగా తుకారం రికార్డు సృష్టించాడు. 

మంచులో చిక్కుకుని ఏడుగురు మృతి :
సాధారణంగా ఏడాదిలో వేసవి సీజన్ లో మాత్రమే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు అనుమతి ఇస్తుంటారు. ఈ సమయంలోనే పర్వతారోహకులు శిఖరాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈసారి ఎవరెస్ట్ ఎక్కేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్వతారోహణకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఎంతోమంది పర్వతారోహకులు అక్కడికి చేరుకున్నారు. శిఖరం ఎక్కే మార్గంలో రద్దీ ఏర్పడింది. గంటల పాటు నిలబడిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం కారణంగా ఇప్పటివరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 
Also Read : జూలైలో ఇండియా ఫస్ట్ స్పేస్ వార్ ఫేర్ ప్రయోగం

Mount Everest
 cheat death
 traffic jam
weather conditions

మరిన్ని వార్తలు