లైవ్‌లో వార్తలు చదువుతుండగా భూకంపం : టేబుల్ కింద దూరిన యాంకర్

Submitted on 10 July 2019
Earthquake while reading the news on live .. Lady Anchor Funny Reaction

ఓ న్యూస్ చానల్ లో ఇద్దరు యాంకర్లు వార్తలు చదువుతున్నారు. ఇంతలో సడెన్ గా స్టూడియో ఊగిపోయింది. కారణం ఇటీవల కాలిఫోర్నియా, నెవాడా, మెక్సికోలో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం. దీంతో వారిద్దరు హడలిపోయారు. ఈ సమయంలో లేడీ యాంకర్ ఎక్స్ ప్రెషన్స్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భూకంపం వచ్చిన సమయంలో కేసీఏఎల్ టీవీ చానెల్ లో  ఇద్దరు యాంకర్లు వార్తలు చదువుతున్నారు. వీరిలో ఒకరు భయపడుతునే వార్తలు చదవటం కొనసాగించారు. కానీ లేడీ యాంకర్ మాత్రం తీవ్రంగా భయపడిపోతూ..‘‘స్టూడియాలో భారీ ప్రకంపనలు వస్తున్నాయి. మేం ఇప్పుడు వార్తలు చదవటం మాని టేబుల్ కిందకు దూరటం సురక్షితమనుకుంటున్నాం’’..అంటు న్యూస్ లో బ్రేక్ చేప్పేసి టేబుల్ కిందకి వెళ్లిపోయింది. ఈ వీడియోను అమెరికా జర్నలిస్ట్ అన్నా మెర్లాన్ ట్విట్టర్‌లో పోస్టు చేయటంతో  అది వైరల్‌గా మారింది. ఆరు లక్షల మందికి పైగా ఈ వీడియోను  వీక్షించారు.  
 

america
earthquake
KCAL TV
Lady Anchor
News
reading
Funny Reaction

మరిన్ని వార్తలు