బఫే వద్దు బంతి భోజనమే ముద్దు : నిలబడి తింటే హార్ట్ ఎటాకే

Submitted on 30 June 2019
Eating food standing up is stressful for the heart

మార్పు మంచిదే..కానీ ఆ మార్పు మనిషికి మంచి చేసేదైఉండాలి. అంతే తప్పా కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టకూడదు. ఆహారం తీసుకునే విధానంలో వచ్చిన మార్పులు కొత్త ఆరోగ్య సమస్యల్ని తెచ్చపెడుతున్నాయి. ఒకప్పుడు భోజనం నేల మీద కూర్చుని తినేవాళ్లం..బంధువుల ఇంట్లో వేడుకలకు వెళితే బంతిభోజనాలు చేసేవాళ్లం..కానీ ఇప్పుడో..అంతా బఫే భోజనాలే.. కూర్చుని తినటం మాట అటుంచీ..తినే పళ్లెం పట్టుకుని తిరుగుతు..తిరుగుతు తింటున్నాం. ఇలా నిలబడి తినటం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు సైంటిస్టులు. నిలబడి తినటం వల్ల గుండెపై ఒత్తడి పెరుగుతుందని తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశముందంటున్నారు. 
 

బంతి భోజనాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా బఫేల రాజ్యమే. పెళ్లిళ్లే కాదు ఏ విందు అయినా ప్లేటు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఆరగిస్తున్నాం. ఇది ఫ్యాషనో..నయా  పోకడో. ఏదైనా సరే నిలబడి తింటే ఆరోగ్యానికి ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు. అంతేకాదు నిలబడి తినే భోజనం టేస్ట్ గా అనిపించదట. 350 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించారు. 
 

‘నిలబడి భోజనం చేసేప్పుడు..శరీరంలోని కింది భాగాల నుంచి పైభాగాల వరకు బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి. అలా జరిగితేనే పై భాగాల వరకు రక్త సరఫరా కావడం కోసం గుండె పంప్ చేయాల్సిన వేగం పెరుగుతుంది. దీంతో గుండె స్పందించే స్థాయి పెరిగి, శరీరంపై ఒత్తిడి పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు..కూర్చుని తిన్నప్పటి కంటే నిల్చుని తినప్పుడు  రుచికి సంబంధించిన కణాలు సరిగ్గా పనిచేయవని..దీంతో తినే ఆహారం అంత రుచిగా అనిపించదని తెలిపారు. అందుకే..మన పూర్వీకులు కూర్చునే తినేవారు. పెద్దల మాట చద్ది మూట అని ఊరికే అనలేదు. రుచిని ఆస్వాదించాలన్నా..ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా కూర్చుని తినమని సూచిస్తున్నారు నిపుణులు. 
 

eating
Food
heart stress
buffet
sitting
america
University of South Florida
Scientists

మరిన్ని వార్తలు