ఏదైనా జరగొచ్చు - ట్రైలర్

Submitted on 13 August 2019
Edaina Jaragocchu Movie TRAILER

నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రం.. 'ఏదైనా జరగొచ్చు'. పూజా సోలంకి, శషా సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. పాపులర్ తమిళ నటుడు బాబీ సింహా నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం, సుధారామ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మించగా.. కె.రమాకాంత్ దర్శకత్వం వహించాడు.

డార్క్ హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా శివాజీ రాజా చేతుల మీదుగా విడుదలైంది. ఏప్రిల్ 1న పుట్టిన ముగ్గురు ఫూల్స్.. తాము స్టుపిడ్స్ కాదని నిరూపించుకోడానికి చేసే పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే పాయింట్‌ తో ఈ సినిమా రూపొందింది.

Read Also : సంపూ మంచి మనసు : కర్ణాటక వరద బాధితులకు సాయం..

ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, నాగబాబు తదితరులు నటించిన ఏదైనా జరగొచ్చు ఆగస్టు 23న విడుదల కానుంది. సంగీతం : శ్రీకాంత్ పెండ్యాల, కెమెరా : సమీర్ రెడ్డి. 

Vijay Raja
Bobby Simha
Pooja Solanki
K RamaKanth

మరిన్ని వార్తలు