బాధ ఎవరికైనా ఒక్కటే : పిల్ల ఏనుగు మృతికి సంతాపం తెలిపిన ఏనుగులు

Submitted on 11 June 2019
Elephants hold funeral procession for dead calf in forest

ఆత్మీయులు చనిపోయినా.. కుటుంబీకులు మరణించినా.. ఆ బాధను వర్ణించలేం. వారి జ్ఞాపకాలు కొన్నాళ్లు బాధిస్తూనే ఉంటాయి. ఇందుకు మూగ జీవాలు అతీతం కాదని నిరూపించాయి ఈ గజరాజులు. అడవిలో పిల్ల ఏనుగు చనిపోతే... ఓ ఏనుగు దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి తీసుకు వచ్చింది. అక్కడ దించి బాధతో దాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఈలోపు.. అటువైపు వచ్చిన మరిన్ని ఏనుగులు.. గున్న ఏనుగు మృతి పట్ల నిమిషం పాటు మౌనం పాటిస్తూ అలాగే నిలబడిపోయాయి.

ఆ తర్వాత.. గున్న ఏనుగును తీసుకువచ్చిన తల్లి ఏనుగు... మృతదేహాన్ని తొండంతో పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లింది. ఈ సీన్.. దూరం నుంచి చూసిన అటవీ అధికారి పర్వీన్‌ కస్వాన్‌ ఆ దృశ్యాలను వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Forest
elephant
Viral Video

మరిన్ని వార్తలు