రూ.4కోట్ల ధర పలికిన నెపోలియన్ ప్రేమలేఖ

Submitted on 11 August 2019
Emperor of France Napoleon Love letter auction  at Rs 4 crore

పురాతన వస్తువుల్ని దక్కించుకోవటానికి కొంతమంది చాలా ఆసక్తి చూపుతారు. పురాతన వస్తువులపై ఉండే ఆసక్తితో ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. 
చరిత్రకు సంబంధించిన వస్తువలకు ఎప్పుడు డిమాండ్ భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇటువంటి వస్తువులు ఎప్పుడు వేలం వేసినా  అత్యధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి. 200ల సంవ్సరాల నాటి ఓ ప్రేమ లేఖ కోట్ల రూపాలు పలికింది. 

ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖాతలకు కలిగిన ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ కు చెందిన 200 ఏళ్ల అత్యంత పురాతన ప్రేమలేఖ ఇప్పుడు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. గురువారం (ఆగస్టు 8)న పారిస్ లో వేసిన వేలం వేశారు.   ప్రజలకు కావాల్సింది సమానత్వం కాదు స్వేచ్ఛ అని నమ్మిన  ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టీ 200 ఏళ్ల క్రితం తన భార్య జోసెఫిన్‌కు రాసిన ప్రేమలేఖ 5,13,000 యూరోలకు వేలంలో అమ్ముడుపోయింది. ఇది ఇండియా కరెన్సీలో రూ. 3. కోట్ల 97 కోట్లు. 

ఈ లేఖ 1796- 1804 మధ్యకాలం నాటిదిగా తెలుస్తోంది. దీన్ని ఫ్రాన్స్‌లో వేలం వేశారు. ఈ లేఖలో నెపోలియన్ తన భార్య జోసెఫిన్ పై ఉన్న ప్రేమను తెలియజేస్తోంది.  ‘నా ప్రియ మిత్రమా! నీ నుంచి నాకు ఎటువంటి లేఖ అందలేదు.మీరు ఏదో ముఖ్యమైన పనిమీద ఉన్నట్లున్నారు. అందుకే మీరు నన్ను మరచిపోయారు. ఇప్పుడు నేను ఉన్న పని, అలసటలతో నాకు  మీరే గుర్తుకు వస్తున్నారు’ అని రాసి ఉన్న ఈ లేఖ ఫ్రాన్స్ లో వేసిన వేలంపాటలో 3.97 కోట్లకు అమ్ముడుపోయింది.  

1796 లో నెపోలియన్ 26 ఏళ్ళ  వితంతువు, ఇద్దరు తల్లి అయిన జోసెఫిన్ తన 32 ఏళ్ళ వయసులో  వివాహం చేసుకున్నారు. వారు 1810 లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నెపోలియన్ ఆస్ట్రియాకు చెందిన మేరీ లూయిస్‌ను వివాహం చేసుకున్నప్పటికీ..తన జీవితాంతం జోసెఫిన్‌ ను ప్రేమిస్తునే ఉన్నారు. 1821 మే 5 తన 51 సంవత్సరాలలో నెపోలియన్ మరణంచినప్పుడు కూడా   ఆఖరి మాటగా జోసెఫిన్ పేరునేనే ఉచ్ఛరించారు నెపోలియన్. కార్లో బోనపార్టీ, లెటిజియా రామోలినో లకు 1769లో జన్మించిన  నెపోలియన్ ఐరోపా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఓ సాధారణ సైన్యాధ్యుడు నుంచి ఫ్రాన్స్ చక్రవర్తి అయ్యారు. 1792లో ఫ్రెంచ్  విప్లవంలో జరుగుతున్న రోజుల్లో నెపోలియన్ విప్లవాత్మకమైన అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 

Emperor of France
Napoleon
Love letter
Paris
auction
Rs 4 crore

మరిన్ని వార్తలు