ఫించ్ సెంచరీ, ఇంగ్లాండ్ టార్గెట్ 286

Submitted on 25 June 2019
england target 286

వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో తలపడిన ఇంగ్లాండ్ బౌలింగ్‌తో విజృంభించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 7వికెట్లు నష్టపోయి 286 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా క్రమంగా తడబడింది. ఫించె సెంచరీతో రాణించగా జట్టు 300కు పైగా స్కోరు చేసేలా కనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ తీయగలిగారు. 

ఓపెనర్లుగా దిగిన ఫించ్(100; 116 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సులు), డేవిడ్ వార్నర్(53; 61 బంతుల్లో 6ఫోర్లు)తో రాణించినప్పటికీ ఇన్నింగ్స్ కుదేలైంది. ఓపెనర్ల శుభారంభాన్ని చక్కగా వినియోగించుకోలేదు ఆసీస్. 22.4ఓవర్లో తొలి వికెట్‌గా వార్నర్ 123పరుగుల వద్ద అవుట్ అయినా.. ఫించ్ క్రీజులో పాతుకుపోయి ఖవాజా(23; 29బంతుల్లో 1ఫోర్)సహకారంతో దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 36వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఫించ్ తర్వాతి బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. 

అప్పటికే క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్(38; 34బంతుల్లో 5ఫోర్లు)తో కాసేపు మెరిశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(12), స్టోయినిస్(8), అలెక్స్ క్యారీ(38), పాట్ కమిన్స్(1), మిచెల్ స్టార్క్(4)లకు ఎక్స్‌ట్రాలు 8చేరడంతో ఆసీస్ 285పరుగులు చేయగలిగింది. 

aron finch
Australia
england
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు