ఫైనల్‌కు ఇంగ్లాండ్: ఆవిరైన ఆశలతో ఆసీస్ ఇంటికి

Submitted on 11 July 2019
England won by 8 wkts

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ 2019లో ఫైనల్ జట్లు ఖరారు అయ్యాయి. భారత్‌‌పై బుధవారం తొలి సెమీ ఫైనల్లో గెలిచిన న్యూజిలాండ్ తో ఫైనల్‌లో పోటీపడేందుకు ఇంగ్లాండ్ అర్హత సాధించింది. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆదివారం మధ్యాహ్నం లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ జరగనుండగా.. సుదీర్ఘ ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లూ తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని కలలుకంటున్నాయి. 

బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలో 223 పరుగులకి ఆలౌటైంది. 224 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. ఓపెనర్లు జాసన్ రాయ్ (85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సులు), జానీ బెయిర్‌స్టో (34; 43 బంతుల్లో 5ఫోర్లు) తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన జోరూట్ (49 నాటౌట్; 46 బంతుల్లో 8ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (45 నాటౌట్: 39 బంతుల్లో 8ఫోర్లు)తో రాణించి గెలుపు లాంఛనాన్ని 32.1 ఓవర్లలో 226/2తో అలవోకగా చేధించి జట్టుకు విజయాన్ని అందించాడు. 

ఆ జట్టులో మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (85; 119 బంతుల్లో 6ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ క్యారీ (46; 70 బంతుల్లో 4ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. లీగ్ దశ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న కెప్టెన్ అరోన్ ఫించ్ (0), ఓపెనర్ డేవిడ్ వార్నర్ (9) నిరాశపరచగా.. హ్యాండ్స్‌కబ్ (4), మాక్స్‌వెల్ (22), కమిన్స్ (6) తేలిపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌వోక్స్, ఆదిల్ రషీద్ మూడేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు. 

england
Australia
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు