హ్యాట్సాప్ తల్లీ : బిడ్డకు జన్మనిచ్చింది.. ఆస్పత్రి నుంచే పరీక్ష రాసింది

Submitted on 13 June 2019
Ethiopian mother earns praise after taking exam 30 minutes after giving birth

ఒకేరోజు కాన్పు..పరీక్ష.. కఠినమైన పరీక్షను ఎంతో నేర్పుగా ధైర్యంగా ఎదుర్కొంది. ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన అర్ధగంటలోపే పరీక్ష రాసి అందరి ప్రశంసలను అందుకుంటోంది వెస్టరన్ ఇథోపియాకు చెందిన 21ఏళ్ల మహిళ. ఈమె పేరు.. అల్మాజ్ డెరిసే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి పరీక్ష రాయడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా ‘వాండర్ ఉమన్’ ప్రశంసల జల్లు కురుస్తోంది.

సెకండరీ స్కూల్ ఎగ్జామ్స్ తన ప్రసవానికి ముందుగానే జరుగుతాయని భావించిన డెరిసేకు.. డెలివరీ రోజే పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఎదురైంది. పరీక్ష ప్రారంభానికి ముందుగానే డెలివరీ కోసం లెబర్ రూంలోకి వెళ్లింది. అయినప్పటికీ తాను పరీక్ష రాయాలనే ఆశయాన్ని వదులుకోలేదు. ఎలాగైనా పరీక్ష రాయాలని భావించింది.

అధికారుల అనుమతితో ఆస్పత్రి బెడ్ పై నుంచే పరీక్ష పూర్తి చేసింది. బీబీసీ ఆఫ్రికా కథనం ప్రకారం.. ప్రెగెన్సీ సమయంలో కూడా డెరెసే తన చదువును వదులుకోలేదు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసేందుకు వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూడటం ఇష్టంలేక అతికష్టమైన పరీక్షకు హాజరైంది.

షెడ్యూల్ ప్రకారం.. డెలవరీ సమయంలో జరిగిన ఇంగ్లీష్, అమ్హరిక్, మ్యాథ్ పరీక్ష లను ఆస్పత్రి నుంచే మూడు పేపర్లు రాసింది. మిగిలిన పరీక్షలను పరీక్షా కేంద్రానికి వెళ్లి రాయాలనుకుంటున్నట్టు తెలిపింది. తన భర్త తడెసే తులూ ప్రోత్సాహంతో డెరిసే పరీక్షను విజయవంతంగా రాయగలిగినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Ethiopian mother
 Write exam
Give birth
Baby Boy
Almaz Derese

మరిన్ని వార్తలు