కస్టోడియల్ డెత్ కేసు : గుజరాత్ మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ కు జీవిత ఖైదు

Submitted on 20 June 2019
Ex-Gujarat Top Cop Sanjiv Bhatt Sentenced To Life In Custodial Death Case

కస్టోడియల్ డెత్ కేసులో గుజరాత్ మాజీ ఐపీఎస్ అధికారికి సంజీవ్ భట్ కు జీవిత ఖైదు విధించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో పోలీసు అదుపులోని వ్యక్తి మృతి చెందిన కేసులో అప్పటి ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను జామ్‌నగర్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. భట్ నిర్లక్ష్యం వల్లే ఒకరు మృతి చెందారని తీర్పు వెల్లడించింది. ఈ కేసులో భట్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. 1990లో గుజరాత్‌‌ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జామ్‌నగర్ జిల్లా ఏఎస్పీ సంజీవ్ భట్‌ పని చేశారు. జామ్ జోద్ పూర్ పట్టణంలో అల్లర్లు జరిగే సమయంలో భట్ .. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో చాలా మంది అల్లర్ల వల్ల గాయపడ్డారు. వారిలో ఒకరైన ప్రభుదాస్ వైష్ణనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాస్తవానికి అతనిని రిలీజ్ చేశాక .. చికిత్స పొందుతూ మ‌ృతి చెందారు. 

అయితే దీనిపై ప్రభుదాస్ వైష్ణనీ అతని సోదరుడు సంజీవ్ భట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భట్ సహా ఆరుగురు పోలీసుల వేధింపులు భరించలేక తన సోదరుడు చనిపోయాడని ఆరోపించారు. దీంతో పోలీసులు సంజీవ్ భట్ పై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో భట్ తోపాటు మరో ఆగురుగురు పోలీసుల పేర్లను కూడా చేర్చారు. ఈ కేసుపై జామ్‌నగర్ సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈమేరకు గురువారం (జూన్ 20, 2019) న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు.

అయితే ఈ కేసుకు సంబంధించి గతవారం సంజీవ్ భట్‌ మరో పిటిషన్ దాఖలు చేశాడు. మరో 11 మందిని విచారించాలని కోరగా... అందుకు కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ పిటిషన్ విచారించినందున తాము మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అల్లర్లు జరిగిన సమయంలో సంజీవ్ భట్ 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో ప్రభుదాస్ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కేసు నమోదైంది.

వాస్తవానికి సంజీవ్ భట్‌ 2011లో వెలుగులోకి వచ్చారు. గుజరాత్ అల్లర్లకు అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ పాత్ర ఉందని సుప్రీంకోర్టులో సంజీవ్ భట్‌ పిటిషన్ దాఖలు చేశారు. భట్ పిటిషన్‌తో ఒక్కసారికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే ఆ తర్వాత భట్‌ను గుజరాత్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఆయనను అకారణంగా విధుల నుంచి తప్పించింది. తమకు చెప్పకుండా విధులకు హాజరవ్వడం లేదని, అలాగే తన అధికార వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై అతన్ని సస్పెండ్ చేశారు. తర్వాత 2015లో విధుల నుంచి పూర్తిగా తొలగించారు. కస్టోడియల్ డెత్ కేసు విచారణలో భట్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేశారు. అయితే పోలీసు ఉన్నతాధికారికి జీవితఖైదు విధించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది.
 

Gujarat Ex -Top Cop
Sanjiv Bhatt
Sentenced To Life
Custodial Death Case

మరిన్ని వార్తలు