కర్ణాటక ఎమ్మెల్యేల కంటే కుక్కలు నయం!

Submitted on 11 July 2019
EX MLA VATAL NAGARAJ FIRES ON POLICE,MLA;'S

కర్ణాటకలో రాజీకీయ పార్టీల కంటే కుక్కలు నయమని, ఎమ్మెల్యేల కంటే కుక్కలను ఎన్నుకుని అసెంబ్లీలోకి పంపించడం బెటర్ అని, కుక్కలే గంభీరంగా ఉంటాయని రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రమాదంలో ఉందన్నారు ప్రముఖ ఉద్యకారుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ అన్నారు. పోలీసులు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. జూలై 11, 2019 మధ్యాహ్నాం బెంగళూరులోని విధానసౌధలో స్పీకర్ ని కలిసేందుకు వెళితే.. పోలీసులు తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. స్పీకర్ చెప్పినా వినకుండా పోలీసులు తనని లోపలికి అనుమతించలేదన్నారు.

సుప్రీం ఆదేశాల ప్రకారం రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలవనున్న విషయం తెలిసిందే. దీంతో విధానసౌధ ప్రాంగణంలో భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.

karnataka
MLA's
Police
ROWDY'S
behaviour
Assembly
Speaker
VATAL NAGARAJ

మరిన్ని వార్తలు