కన్నబాబును పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి 

Submitted on 12 July 2019
EX MP, Mega star chiranjeevi condolence to ap minister kannababu

కాకినాడ: ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. కన్నబాబు సోదరుడు సురేష్‌ బాబు ఆకస్మిక మరణం పట్ల తన సంతాపాన్ని తెలియజేసారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని కన్నబాబుకు ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కన్నబాబు కుటుంబంతో తనకు ఉన్న అనుబంధంతో ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా ఆయన కాకినాడ వచ్చారు. 

కన్నబాబు సోదరుడు సురేష్ బాబు బుధవారం రాత్రి గుండెపోటుతో విజయవాడలో మరణించారు. సురేష్ బాబు మరణానికి గల కారణాలను చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా తనకు కుడి భుజం లాంటి సురేష్ బాబును తలచుకుని కన్నబాబు కన్నీటి పర్యంతమయ్యారు. చిరంజీవి కన్నబాబుకు దైర్యం చెప్పారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.  

కన్నబాబు పెద్ద సోదరుడు సురేష్ బాబు బిల్డర్ గా విశాఖపట్నంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంత్రి కన్నబాబు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గోనాల్సి ఉన్నందున ఆయనతో పాటు సురేష్ బాబు విజయవాడ వచ్చారు. బుధవారం రాత్రి గుండె నొప్పివచ్చి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు  ఆంధ్రా ఆస్పత్రికి తీసుకెళ్లారు  అప్పటికే సురేష్  మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Andhra Pradesh
Kurasala Kannababu
Mega Star Chiranjeevi
CONDOLENCE
heart attack


మరిన్ని వార్తలు