రూ.3 లక్షలు క్యాష్ ప్రైజ్ : ఇండియాలో Facebook ఫస్ట్ గేమ్ షో 

Submitted on 11 June 2019
Facebook Launches Confetti in India, Its First Interactive Game Show

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కొత్త లైవ్ స్ట్రీమింగ్ గేమ్ షోను ప్రవేశపెట్టింది. ఇండియా యూజర్లను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్..‘Confetti’ అనే టైటిల్ తో ఫస్ట్ ఇంటరాక్టీవ్ గేమ్ షోను మంగళవారం (జూన్ 4న) ప్రకటించింది. ఈ గేమ్ షో జూన్ 12 (బుధవారం) నుంచి ఫేస్బుక్ వీడియో ప్లాట్ ఫాంపై ఫేస్ బుక్ వాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టుకంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు :
Confetti అనే ఇంటరాక్టీవ్ గేమ్ షోను Facebook తొలుత అమెరికాలో లాంచ్ చేసింది. ఈ గేమ్ షోలో పాల్గొనే వారిని పాప్ కల్చర్ కు సంబంధించి చిన్నపాటి ప్రశ్నలను అడుగుతారు. Game Showలో పాల్గొన్నవారు ఈ ప్రశ్నల్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇలా ప్రశ్నలకు సమాధానం చెబితే ప్రతిరోజు రూ.3 లక్షల వరకు క్యాష్ ప్రైజ్ గెలిచే అవకాశం ఉంది.

‘ఇండియాలో మా ఫస్ట్ అధికారిక గేమ్ షో. ఎంతవరకు యూజర్ల ఎంగేజ్ మెంట్ ఈ గేమ్ షో ద్వారా ఇంటరాక్టీవ్ అవుతారో చూడాలి. అన్ని కమ్యూనిటీలు కలిసి గేమ్ షోలో ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం’ అని ఫేస్ బుక్ పార్టనర్ షిప్స్ హెడ్, డైరెక్టర్ మనీష్ చోప్రా తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్ Game Show ను ముంబైలో ప్రకటించారు.ఫేస్ బుక్ సోషల్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ సందర్భంగా ఈ గేమ్ షోను ప్రకటించినట్టు చోప్రా తెలిపారు.

ఫేస్ బుక్ వాచ్ ప్రకారం.. ఈ గేమ్ షో ఇప్పటికే ప్రపంచంలోని కెనడా, యూకే, మెక్సికో, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్ఫైన్స్ సహా పలు దేశాల్లో అందుబాటులో ఉంది. సోషల్ దిగ్గజం ఫేస్ బుక్ 2018లో ప్రపంచవ్యాప్తంగా వీడియో ఆన్ డిమాండ్ సర్వీసు ‘Facebook Watch’ను ప్రవేశపెట్టింది. యూట్యూబ్ కు పోటీగా ఫేస్ బుక్ ఈ సర్వీసు అందుబాటులోకి తెచ్చింది.

ఈ వీడియో సర్వీసు ద్వారా ఫేస్ బుక్ యూజర్లు ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, న్యూస్ వంటి కేటగిరీల వీడియోలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. రీసెంట్ వీడియోలను ‘Watch Feed’ కలెక్షన్ పేజీలపై యూజర్లు చూసి ఫాలో అయ్యేలా సర్వీసును రూపొందించారు.

Facebook
Confetti
Interactive Game Show
Facebook Watch
Live Video Streaming Service

మరిన్ని వార్తలు