నిఘా వర్గాల రిపోర్ట్ : ఆ భయంతోనే పాక్.. ఉగ్ర శిబిరాలను మూసేస్తోంది!

Submitted on 10 June 2019
Fearing more Balakots, Pakistan shuts down terror camps in PoK

పాకిస్థాన్ కు భారత్ నుంచి ప్రతీకార భయం పట్టుకుంది. బాలకోట్ వంటి మరిన్ని ప్రతీకార దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయంతోనే పాకిస్థాన్ తమ భూభాగంలోని తీవ్రవాద శిబిరాలను మూసివేస్తున్నట్టు కనిపిస్తోంది. తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో పాకిస్థాన్ కొన్ని నెలల నుంచి పీఓకేలో తీవ్రవాద శిబిరాలను మూసివేస్తూ వస్తోంది.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని తీవ్రవాద శిబిరాలకు పాక్ ఆర్మీ కొమ్ము కాస్తోందంటూ భారత్ కొన్ని ఆధారాలను అంతర్జాతీయ దేశాల ముందు ఉంచింది. దీంతో అంతర్జాతీయ కమ్యూనిటీ నుంచి పాకిస్థాన్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో పాక్.. తమ భూభాగంలోని తీవ్రవాద శిబిరాలను షట్ డౌన్ చేసినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.
Also Read : కథువా కేసులో కీలక తీర్పు: ముగ్గురికి జీవిత ఖైదు

నిఘా వర్గాల నివేదిక ప్రకారం.. పీఓకేలో 11 వరకు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అందులో ఐదు స్థావరాలు ముజాప్ఫారాబాద్, కోట్లీ క్లస్టర్స్.. ఒకటి బర్నాలా ప్రాంతంలో ఉంది. కొన్ని టెర్రర్ క్యాంపులు లష్కరే ఈ తోయిబాకు చెందినవి ఉన్నాయి. కోట్లీ, నికియాల్ ప్రాంతాల్లోని సుందర్ బానీ, రాజౌరిలో ఉండగా.. ఈ స్థావరాలను పాక్ మూసివేసింది.

పాలా, బాగ్ ప్రాంతాల్లోని జైషే ఈ మహ్మద్ తీవ్రవాద శిబిరాలను కూడా పాక్ మూయించింది. కోట్లీ ప్రాంతంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్ర స్థావరాన్ని కూడా పాక్ షట్ డౌన్ చేసింది.  ముజాప్ఫార్ బాద్, మిర్ పూర్ ప్రాంతంలోని ఉగ్ర స్థావరాలను పాక్ షట్ డౌన్ చేసింది.

లష్కరే ఈ తోయిబా, జైషే ఈ మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన టెర్రర్ క్యాంపులను తాత్కాలికంగా మూసివేసినట్టు నివేదిక తెలిపింది. కొన్ని నెలల క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన బాల్ కోట్ వైమానిక దాడుల తర్వాత భారత బలగాలు ఎల్ ఓసీకి సమీపంలోని పీఓకేలో టెర్రర్ గ్రూపులను అణిచివేయాలని ఒత్తిడి తీసుకోస్తున్నాయి. మరోవైపు ఇరుదేశాల భద్రతా బలగాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలని పాకిస్థాన్ కూడా భారత్ ను కోరుతున్నట్టు నివేదిక తెలిపింది.
Also Read : అమెజాన్ ఎకో డివైజ్ : Alexa.. హిందీలోనూ మాట్లాడగలదు!

Balakot attack
Pakistan
 shuts down
 terror camps
pok

మరిన్ని వార్తలు